తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!
హైదరాబాద్, నవంబర్ 2: తుపాను ప్రభావంతో తెలంగాణలో రానున్న గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.