BREAKING
thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 08:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో బంధం శ్రీను ప్రచార జోరు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 08:20 PM
27 వీక్షణలు

బీసీ ప్రాతినిధ్యానికి ప్రజల మద్దతు కోరుతూ ఇంటింటి ప్రచారం సర్పంచ్‌గా అవకాశం కల్పించండి.. 

పెనుగొలనులో బంధం శ్రీను ప్రచార జోరు.. బీసీ ప్రాతినిధ్యానికి ప్రజల మద్దతు కోరుతూ ఇంటింటి ప్రచారం సర్పంచ్‌గా అవకాశం కల్పించండి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి 

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బంధం శ్రీను గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ గ్రామ ప్రజలను ఆత్మీయంగా పలకరించి, తనకు ఒక అవకాశం కల్పించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా గెలిపించి వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బంధం శ్రీనుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నాయకులు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనుకు వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం స్థానిక రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యతనిచ్చే నిర్ణయమని పేర్కొన్నారు. గ్రామస్థాయి పాలనలో బీసీలకు తగిన గుర్తింపు, రాజకీయ అవకాశాలు లభించాలంటే ప్రజల మద్దతు ఎంతో అవసరమని అన్నారు. బీసీ వర్గాలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బంధం శ్రీనుకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో పెనుగొలనులో రాజకీయ సందడి నెలకొంది. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు జూలూరు ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ రెడ్డి, సంగెపు దేవసహాయం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.