పెనుగొలనులో మేళతాళాలతో గణపతి నిమజ్జనం
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని యాదవ బజారులో కొలువుదీరిన గణపతికి ఏడవ రోజు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గణపతి విగ్రహాన్ని ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపుగా తీసుకెళ్లి శివాలయం వద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఈ ఊరేగింపులో మహిళలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు గుమ్మ గోపరాజు, లేళ్ల వెంకటేశ్వర్లు, ఎనుముల చిన్నబ్బాయి, లేళ్ల కృష్ణ, లేళ్ల జానకి, గుమ్మ వెంకటకృష్ణ, లేళ్ల నారాయణ పర్యవేక్షించారు.
పెనుగొలనులో రేపు గణపతి కళ్యాణం
పెనుగోలు గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం వెనుక కొలువుదీరిన గణపతికి ఈనెల 22వ తేదీ మంగళవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 23వ తేదీ బుధవారం గణపతి నిమజ్జనం నిర్వహించనున్నట్లు తెలిపారు.