ఏపీలో సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆరేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తూ ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్‌ను కేటాయించాలని నిర్ణయించింది. 11వ పీఆర్సీ నిబంధనల ప్రకారం సంబంధిత ప్రయోజనాలు వర్తింపజేస్తున్నట్లు స్వర్ణ వార్డు, గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో అర్హత కలిగిన ఉద్యోగులకు వేతనపరమైన ప్రయోజనాలు అందనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.