BREAKING
thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు
Date of Publish : 22 September 2026, 07:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు గుడ్‌న్యూస్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 07:35 AM
4 వీక్షణలు

కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఎన్నికలు నిర్వహించలేదన్న కారణంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఆయా గ్రామపంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రామపంచాయతీలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించారు. ఇందులో భాగంగా 58 గ్రామపంచాయతీలకు మొత్తం రూ.33.62 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు ఇప్పటికే ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికలు జరగలేదన్న కారణంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు అందకపోయినా గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, మౌలిక వసతుల పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టింది.