BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 09:59 am
Posted by : MOOLA RAJENDRA REDDY

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
06 Nov, 2026 - 09:59 AM
7 వీక్షణలు

సిరివెళ్ల: మండల పరిధిలోని యర్రగుంట్ల–వెంకటాపురం మధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి కాలువలో కూరుకుపోయింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

బస్సు రహదారిని విడిచి పంట పొలాల్లోకి దూసుకెళ్లి కాలువలోకి చేరడంతో ప్రమాద తీవ్రతపై ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే బావులు, విద్యుత్ స్తంభాలు ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భావించారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు మరింత ప్రమాదానికి గురికాకుండా నిలిచిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారెవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని పలువురు సూచిస్తున్నారు.