BREAKING
thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 06 November 2026, 08:34 am
Posted by : K MAHESH

ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:34 AM
12 వీక్షణలు

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. నవంబర్ 20 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకం అమలుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం, కుటుంబ పెద్ద లేదా ప్రధాన ఆదాయ వనరును కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.

నవంబర్ 19న సిద్దిపేటలో ప్రారంభం

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు.

నవంబర్ 20 నుంచి ఇంటింటికీ దరఖాస్తుల సేకరణ

పథకం అమలులో భాగంగా నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల నుంచి దరఖాస్తులు సేకరించనున్నాయి. సేకరించిన దరఖాస్తులను తహసీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వీకరించనున్నారు.

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుతో రాష్ట్రంలోని కుటుంబాలకు జీవిత బీమా రక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకం ద్వారా ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక సహాయం అందే అవకాశం కల్పించనున్నారు.