BREAKING
thumb ● ఆరుట్ల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన thumb ● కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి thumb ● ఆళ్లగడ్డలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం thumb ● 60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. thumb ● బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం పెంపు.. thumb ● పేదవారి ఇంట వెలిగే దీపమే నిజమైన దీపావళి.. thumb ● నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఆరుట్ల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన thumb ● కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి thumb ● ఆళ్లగడ్డలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం thumb ● 60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. thumb ● బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం పెంపు.. thumb ● పేదవారి ఇంట వెలిగే దీపమే నిజమైన దీపావళి.. thumb ● నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు
Test 4
Date of Publish : 06 November 2026, 06:28 pm
Posted by : K MAHESH

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 06:28 PM
12 వీక్షణలు

నవంబర్ 21 నుంచి 41 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనం!

జగిత్యాల (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత అరుదైన హనుమాన్ చందనోత్సవం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, చందనోత్సవం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల అనంతరం నవంబర్ 21 నుంచి వరుసగా 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు.

కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ స్వామివారు రెండు ముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. తూర్పు వైపు నరసింహస్వామిగా, ఉత్తరం వైపు ఆంజనేయస్వామిగా కొలువై ఉంటారు. ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం స్వామివారి మూలవిరాట్టుకు సింధూర లేపనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో విగ్రహంపై సుమారు ఆరు అంగుళాల మందంతో సింధూరం పేరుకుపోయింది. దీంతో ప్రస్తుతం భక్తులకు స్వామివారి అసలు రూపాన్ని దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో సుమారు 60 ఏళ్ల తర్వాత స్వామివారి మూలవిరాట్టుపై పేరుకుపోయిన సింధూరాన్ని తొలగించి చందనోత్సవం నిర్వహించాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, ఇతర వైదిక కార్యక్రమాల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకోసం అర్చకులు ముందుగానే ప్రత్యేక దీక్షలు స్వీకరించనున్నారు.

సింధూరాన్ని తొలగించేందుకు రావి, జువ్వి, మర్రి, మేడి, దరిమి వంటి పవిత్ర వృక్షాల కలపను ఉపయోగించనున్నారు. యాగశాలలో సుమారు 50 మంది రుత్వికులతో త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆలయ రాజగోపురంపై సుదర్శన చక్రం, కలశ స్థాపన వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ఐదు రోజుల పాటు మూలవిరాట్టు దర్శనం నిలిపివేత

చందనోత్సవం, సింధూర తొలగింపు కార్యక్రమాలు జరిగే నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు భక్తులకు అంజన్న మూలవిరాట్టు దర్శనం అందుబాటులో ఉండదు. ఈ సమయంలో ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కర్ర ఉత్సవమూర్తి ఆంజనేయస్వామితో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.

నవంబర్ 21 నుంచి 41 రోజుల పాటు నిజరూప దర్శనం

సింధూర తొలగింపు, చందనోత్సవ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం నవంబర్ 21 నుంచి స్వామివారి నిజరూప దర్శనాన్ని ప్రారంభించనున్నారు. ఈ అరుదైన అవకాశాన్ని 41 రోజుల పాటు భక్తులకు కల్పించనున్నారు. ఆరు దశాబ్దాల తర్వాత స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునే అవకాశం రావడంతో భక్తుల్లో ఆసక్తి, ఆనందం వ్యక్తమవుతున్నాయి.

భారీగా తరలిరానున్న భక్తులు.. ప్రత్యేక ఏర్పాట్లు

41 రోజుల నిజరూప దర్శన సమయంలో కొండగట్టుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు 50 వేల మంది చొప్పున మొత్తం 20 లక్షల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది.

చందనోత్సవం, నిజరూప దర్శన ఏర్పాట్ల కోసం దేవస్థానం సుమారు రూ.20 లక్షలు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆరు దశాబ్దాల తర్వాత కొండగట్టు అంజన్న ఆలయంలో జరగనున్న ఈ చందనోత్సవం ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 41 రోజుల పాటు లభించనున్న స్వామివారి నిజరూప దర్శనం కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.