BREAKING
thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం thumb ● లింగంపల్లిలో విఆర్ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం thumb ● చిన్నారుల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపడమే లక్ష్యం thumb ● రిపోర్టర్ పల్నాటి జగన్ దశదినకర్మలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు thumb ● ఆర్టీఐ రక్షక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అట్ల శ్రీనివాస్ రెడ్డి నియామకం thumb ● దీపావళి నేపథ్యంలో పేకాటపై నిషేధం thumb ● డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన వడ్డేపల్లి వెంకటేష్ thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం thumb ● లింగంపల్లిలో విఆర్ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం thumb ● చిన్నారుల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపడమే లక్ష్యం thumb ● రిపోర్టర్ పల్నాటి జగన్ దశదినకర్మలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు thumb ● ఆర్టీఐ రక్షక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అట్ల శ్రీనివాస్ రెడ్డి నియామకం thumb ● దీపావళి నేపథ్యంలో పేకాటపై నిషేధం thumb ● డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన వడ్డేపల్లి వెంకటేష్
Test 4
Date of Publish : 06 November 2026, 07:09 pm
Posted by : K MAHESH

ఆరుట్ల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:09 PM
39 వీక్షణలు

ఆరుట్ల, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శివాలయం సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకంరాజు ముదిరాజ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ఉన్న ఖాళీ స్థలానికి రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఆ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్ తెలిపారు. ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

దేవాలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం అందుబాటులో ఉండేలా, భక్తులు ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసుకునేందుకు వీలుగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ నిర్మాణానికి సహకారం అందిస్తున్న పోచమ్మ దేవాలయ నిర్మాణదాత వెదిరె పాండురంగారెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామస్తులు, దాతలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంచాల సహకార బ్యాంక్ డైరెక్టర్ కొంగర జనార్దన్ రెడ్డి, ఆరుట్ల మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, అన్నంగళ్ల యాదయ్య, మాజీ ఎంపీటీసీ చీరాల రమేష్, ప్రజా సంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కొండిగారి శ్రావణ్ కుమార్, మంద మాధవి, మోహన్ రెడ్డి, పున్నం రాము, రావుల జంగయ్య, మానిపాటి భానుప్రసాద్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మాడుగుల బాలమణికృష్ణగౌడ్, మొర్రి పద్మ, ఐలయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కంబాలపల్లి బుగ్గరాములు, ప్రజాగళం దామర భూపాల్, గ్రామస్తులు మాడుగుల కృష్ణగౌడ్, దంటు మధుసూదన్ రెడ్డి, గుడ్డిమల్ల చంద్రయ్య, ముదిరాజ్ చిందం రఘుపతి, మెండు వెంకటరెడ్డి, మంద మోహన్ రెడ్డి, కొంగర వెంకటరెడ్డి, మొర్రి ఐలయ్య, తాడూరి రాజేందర్ రెడ్డి, మహమ్మద్ జానీపాషా, నూకం బాలరాజ్ ముదిరాజ్, మహమ్మద్ సద్దాం అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.