BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:32 pm
Posted by : K MAHESH

ఆర్టీఐ రక్షక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అట్ల శ్రీనివాస్ రెడ్డి నియామకం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:32 PM
15 వీక్షణలు

అవినీతి నిర్మూలనే నా ప్రధాన లక్ష్యం: అట్ల శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్ (ఎన్ టుడే న్యూస్): ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అట్ల శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆర్టీఐ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు చెన్నూరి ప్రవీణ్ మాట్లాడుతూ, అట్ల శ్రీనివాస్ రెడ్డి సేవలు, అనుభవం సంస్థ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

నూతనంగా నియమితులైన అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్, జిల్లా అధ్యక్షుడు చెన్నూరి ప్రవీణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో యువతకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు.

అవినీతి, అక్రమాలపై చట్టబద్ధంగా పోరాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో అవినీతి నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తానని అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, సంస్థ నాయకులు, కార్యకర్తలు అట్ల శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపారు.