BREAKING
thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం
Test 4
Date of Publish : 07 November 2026, 08:53 pm
Posted by : K MAHESH

కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:53 PM
5 వీక్షణలు

విద్యార్థుల సమస్యలు, పాఠశాలలో సౌకర్యాలపై ఆరా.. భోజన నాణ్యతపై అసంతృప్తి

యాదాద్రి భువనగిరి (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, కళాశాల (మైనారిటీ)ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాలికలకు కల్పించిన సౌకర్యాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు శాతం, వంటకాల నాణ్యతపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు తమ సమస్యలను కమిషన్ సభ్యురాలికి లిఖితపూర్వకంగా వివరించినట్లు సమాచారం.

యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కమిటీ సభ్యుడు కొడారి వెంకటేష్ గతంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో సభ్యురాలు గోగుల సరిత పాఠశాలను సందర్శించినట్లు తెలిసింది.

ఈ తనిఖీలో పాఠశాల ఉపాధ్యాయురాలు సువర్ణ, బీఆర్‌బీ కో-ఆర్డినేటర్ అనంతలక్ష్మి, చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు.