BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 09:00 pm
Posted by : NAGARAJU GADE

సంతకవిటి మండలంలో టీడీపీకి మెజారిటీ స్థానాలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
07 Nov, 2026 - 09:00 PM
4 వీక్షణలు

ఎంపీటీసీగా కొల్ల యశస్సు, జెడ్పీటీసీగా వల్లూరు సంగీత విజయం.. 19 స్థానాల్లో 15 టీడీపీ ఖాతాలోకి

సంతకవిటి (ఎన్ టుడే న్యూస్): సంతకవిటి మండల స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎంపీటీసీ అభ్యర్థి కొల్ల యశస్సు 1,661 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, జెడ్పీటీసీ అభ్యర్థి వల్లూరు సంగీత 5,686 ఓట్లు సాధించి గెలుపొందారు. మండలంలోని మొత్తం 19 స్థానాలకు గాను టీడీపీ 15 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించారు.

ఈ ఫలితాలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొల్ల కుటుంబంపై ప్రజలు చూపిన ఆదరణ, కొల్ల అప్పలనాయుడు నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు రాజాం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన అనుచరులు తెలిపారు. ఆయన నాయకత్వం, రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఆయన కుమారుడు కొల్ల యశస్సు ఎంపీటీసీగా విజయం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంతకవిటి మండల ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు తెలిపారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ విజయాన్ని పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, ప్రజలకు లభించిన మద్దతుగా అభివర్ణించారు.