BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండల రాజకీయాల్లో సంచలనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 08:50 PM
3 వీక్షణలు

పోలవరం ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పానుగంటి రజిని ఘన విజయం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని పోలవరం ఎంపీటీసీ ఎన్నికల ఫలితం మండలవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. నామినేషన్లకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన పానుగంటి రజినికి అవకాశం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో హోరాహోరీగా సాగిన పోటీలో 37 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి తన సత్తా చాటారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల అధికారులు ఆమెకు విజయ ధ్రువీకరణ పత్రం (డిక్లరేషన్ ఫారం) అందజేశారు. కేవలం పోలవరం గ్రామానికే పరిమితం కాకుండా చాట్రాయి మండల రాజకీయాల్లోనూ ఈ ఫలితం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ టికెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం స్థానిక రాజకీయ పరిణామాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చాట్రాయి మండల రాజకీయ చరిత్రలో ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.