BREAKING
thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం
Test 4
Date of Publish : 07 November 2026, 08:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చండ్రుపట్ల గ్రామంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 08:55 PM
4 వీక్షణలు

వ్యర్థాల తగ్గింపు.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఏడు ఆచరణలపై అవగాహన విస్సన్నపేట, నవంబర్ 7: ఏలూరు జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు – 2026లో భాగంగా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒక వారం.. ఏడు ఆచరణలు.. ఒక భవిష్యత్తు అనే నినాదంతో వ్యర్థాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మన దైనందిన జీవితంలో ఆహారం, నీరు, విద్యుత్తు, డబ్బు, సమయం వంటి విలువైన వనరులు తెలియకుండానే వృథా అవుతున్నాయని, ఈ వృథాను అరికట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకోవచ్చని కార్యక్రమంలో వివరించారు. ఆహార వృథాను అరికట్టేందుకు వారానికి సరిపడా వంటకాల ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని, అవసరమైన సరుకులు, కూరగాయలు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. భోజనం సమయంలో అవసరమైనంత మాత్రమే వడ్డించుకోవాలని, శుభకార్యాలు, పండుగల సందర్భాల్లో మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా పేదలకు, అనాథాశ్రమాలకు అందించాలని తెలిపారు. నీటి వృథాను నివారించేందుకు ఇంట్లో నల్లాలు, పైపుల నుంచి నీరు లీకేజీ కాకుండా చూసుకోవాలని, బియ్యం, కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు వినియోగించాలని సూచించారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించడం వల్ల భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. విద్యుత్తు పొదుపులో భాగంగా అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను నిలిపివేయాలని, గదుల నుంచి బయటకు వెళ్లేటప్పుడు విద్యుత్తు పరికరాలను ఆపివేయాలని సూచించారు. పగటిపూట సహజ వెలుతురు, గాలిని వినియోగించుకోవడం ద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు. అలాగే ప్రతి నెలా కుటుంబ ఖర్చులకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించుకోవాలని, అనవసర విలాసాలకు దూరంగా ఉంటూ ఆదాయంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలని తెలిపారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రోజువారీ పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, రీల్స్, టీవీల ముందు గంటల తరబడి గడపకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ చిన్నచిన్న మార్పులను ప్రతి ఒక్కరూ తమ దైనందిన అలవాట్లలో భాగం చేసుకుంటే ప్రకృతి వనరులను, దేశ సంపదను, వ్యక్తిగత ఆర్థిక వనరులను కాపాడుకోవచ్చని నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ యూనిట్ ఇన్‌చార్జి జి. శ్రీనివాసరావు, శాఖ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.