BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 09:11 pm
Posted by : K MAHESH

దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 09:11 PM
9 వీక్షణలు

బాణసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ సీత పాండు

సంస్థాన్ నారాయణపురం (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పాటు సురక్షితంగా జరుపుకోవాలని సంస్థాన్ నారాయణపురం ఎస్‌ఐ సీత పాండు సూచించారు. పండుగ సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

బాణసంచా కాల్చే సమయంలో అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు, కంటి గాయాలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇళ్లకు దూరంగా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలని, ఈ సందర్భంగా కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు.

చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, చేతిలో పట్టుకుని బాణసంచా వెలిగించకూడదని పేర్కొన్నారు. పేలని టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయవద్దని, ముందస్తు జాగ్రత్తగా నీరు లేదా ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు తావులేకుండా దీపావళి పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్‌ఐ సీత పాండు కోరారు.