BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:49 pm
Posted by : K MAHESH

ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:49 PM
8 వీక్షణలు

కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి: సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బి. అజయ్ సారధి రెడ్డి

నెల్లికుదురు (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: నెల్లికుదురు మండలంలోని ఎండిన చెరువులను ఎస్సారెస్పీ జలాలతో నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ మహబూబాబాద్ నియోజకవర్గ కార్యదర్శి బి. అజయ్ సారధి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని మునిగలవేడు గ్రామంలో ఎండిపోయిన నడిచెరువును సీపీఐ కరువు బృందం సందర్శించింది.

ఈ సందర్భంగా అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ, నెల్లికుదురు మండలంలోని ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపి రైతులకు అండగా నిలవాలని కోరారు. చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు, రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మండలంలో కరువు సహాయక చర్యలను తక్షణమే చేపట్టి రైతాంగానికి ఉపశమనం కల్పించాలని అన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5,000 చొప్పున కరువు భత్యం అందించాలని కోరారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని, నెల్లికుదురు మండలంలోని రైతులందరికీ ఉచితంగా ఎరువులు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ఎండిన చెరువులోకి దిగి పరిస్థితిని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వరిపల్లి వెంకన్న, మండల కార్యదర్శి బైస స్వామి, మండల సహాయ కార్యదర్శి చిర్ర సత్యనారాయణ, జిల్లా నాయకులు చిర్ర వెంకన్న, మేక వీరన్న, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, కేదాసు రమేష్, వీరవెల్లి రవి, వెన్నమల రవీందర్, దస్తగిరి లక్ష్మణ్, రఫీ, తిరుమల మల్లేష్, శ్యామల్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు.