BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:48 pm
Posted by : P GAJENDRA BABU

తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency Reporter
07 Nov, 2026 - 08:48 PM
9 వీక్షణలు

విజయం ప్రజలది.. పదవి సేవ చేసేందుకు దక్కిన బాధ్యత

తొట్టంబేడు: తొట్టంబేడు మండల ప్రజాభ్యుదయ ప్రస్థానంలో తన విజయం చారిత్రాత్మక ఘట్టమని రావిళ్ల మునిరాజా నాయుడు పేర్కొన్నారు. ఈ విజయం తన ఒక్కడిదే కాదని, మండల అభివృద్ధిని ఆకాంక్షించిన ప్రజలు, తన కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలందరిదని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా ఓటు వేసి గెలిపించిన అనంతరం రావిళ్ల మునిరాజా నాయుడు గ్రామంలో అడుగుపెట్టి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మను కలిశారు. ఈ సందర్భంగా వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తనను నమ్మి, అండగా నిలిచి ముందుకు నడిపించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో పేర్కొన్నారు.

నాయకుల మార్గదర్శకత్వంలో, ప్రజలు విశ్వసించిన అభివృద్ధి బాటలో తొట్టంబేడు మండలాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తనను ఆశీర్వదించి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పదవిని అధికారంగా కాకుండా తొట్టంబేడు మండల ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.