BREAKING
thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం
Test 4
Date of Publish : 07 November 2026, 09:11 pm
Posted by : PAGADALA DEVAIAH

కారు వెనుక అద్దం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
07 Nov, 2026 - 09:11 PM
3 వీక్షణలు

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: రిటైర్డ్ ఎస్పీ గౌతమ్‌కు చెందిన కారును ధ్వంసం చేసిన కేసులో సరూర్‌నగర్‌కు చెందిన టీ. మల్లికార్జున్ (22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గౌతమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీన రాత్రి రిటైర్డ్ ఎస్పీ ఇంటి వద్ద పార్క్ చేసిన కారుకు వెనుక భాగంలోని అద్దాన్ని నిందితుడు ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

నిందితుడు మల్లికార్జున్ సరూర్‌నగర్‌లో నివాసం ఉంటూ పీఎంటీ కాలనీలోని ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన మందులను రిటైర్డ్ ఎస్పీ అభ్యర్థన మేరకు ఆయన ఇంటికి సరఫరా చేసిన సమయంలో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుందని విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఆ ఘటనపై మనసులో పెట్టుకున్న నిందితుడు ఈ నెల 2వ తేదీన రాత్రి కారును ధ్వంసం చేసినట్లు తెలిపారు.

నిందితుడిపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.