BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:28 pm
Posted by : K MAHESH

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన వడ్డేపల్లి వెంకటేష్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:28 PM
6 వీక్షణలు

నవంబర్ 15న న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం

రామన్నపేట (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7:

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ అవార్డు–2026కు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన వడ్డేపల్లి వెంకటేష్ ఎంపికయ్యారు. దళితరత్న యువజన సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జాతీయ అవార్డు కమిటీ ప్రకటించింది.

ఈ మేరకు అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో వెంకటేష్‌కు అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని ప్రోత్సహించి, సమాజంలో మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేస్తోందని తెలిపారు. ప్రజా ఉద్యమకారులు, సంఘసేవకులు, రచయితలు, కవులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను గుర్తించి పురస్కారాలతో గౌరవిస్తున్నట్లు వివరించారు.

ఈ ఏడాది నవంబర్ 15న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ మహాసభల సందర్భంగా అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ జాతీయ సదస్సుకు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.

వడ్డేపల్లి వెంకటేష్ ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అవార్డు ఆహ్వాన పత్రం అందజేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు టేకి రాజశేఖర్, కనుకుంట్ల విజయ్ కుమార్, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యుడు బి. భాస్కర్ ఉన్నారు.