BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:34 pm
Posted by : K MAHESH

చిన్నారుల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపడమే లక్ష్యం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:34 PM
6 వీక్షణలు

ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న

కేసముద్రం (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: చిన్నారుల భవిష్యత్తుకు విద్యాబీజం వేస్తూ, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న అన్నారు.

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు భూక్యా తండా (కట్టు కాల్వ) అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన అక్షరాభ్యాసం, మొదటి ముద్ద కార్యక్రమానికి చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్‌పర్సన్ అల్లం రమా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించి, మొదటి ముద్ద కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ, చిన్నారులకు చిన్న వయస్సు నుంచే విద్య ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆరోగ్యం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంటూ, వాటి సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బానోత్ విజయ బధ్య, అడిషనల్ సీడీపీఓ కమలాదేవి, సెక్టార్ సూపర్‌వైజర్ సర్దార్ బి, అంగన్‌వాడీ టీచర్ కవిత, ఆశా వర్కర్, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.