BREAKING
thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ thumb ● అక్రమ మద్యం విక్రయాలపై విచారణ జరిపించాలి thumb ● MPTC, ZPTC ఓట్ల లెక్కింపునకు పటిష్ట పోలీస్ బందోబస్తు thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ thumb ● అక్రమ మద్యం విక్రయాలపై విచారణ జరిపించాలి thumb ● MPTC, ZPTC ఓట్ల లెక్కింపునకు పటిష్ట పోలీస్ బందోబస్తు
Test 4
Date of Publish : 06 November 2026, 06:57 pm
Posted by : PAGADALA DEVAIAH

సమాచార హక్కు చట్టం అమలు గాలికి వదిలేశారా?

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
06 Nov, 2026 - 06:57 PM
24 వీక్షణలు
  • సమాచార హక్కు చట్టం అమలు గాలికి వదిలేశారా?
  • అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న ఆర్టీఐ సూచిక బోర్డులు.. అసంపూర్తి సమాచారంతో ప్రజలకు ఇక్కట్లు!
  • ఉప్పల్, అబిడ్స్ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డుల దుస్థితిపై రాపోలు లింగస్వామి ఆగ్రహం

 హైదరాబాద్ నవంబర్ 06/ఎన్ టుడే న్యూస్.

సామాన్యులకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించేందుకు తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం (2005) అమలు అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోందని ఆర్టీఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు లింగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన సూచిక బోర్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి బోర్డు సగం పాడైపోయి, అసంపూర్తి సమాచారంతో నిరుపయోగంగా కనిపించడాన్ని గుర్తించారు. అదేవిధంగా అబిడ్స్‌లోని మరో ప్రభుత్వ కార్యాలయంలోనూ సంబంధిత అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు లేకుండా అసంపూర్తి సమాచారంతో బోర్డులు దర్శనమిచ్చాయని తెలిపారు.ఈ సందర్భంగా రాపోలు లింగస్వామి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 22 ఏళ్లు గడుస్తున్నా, నేటికీ సామాన్య ప్రజలకు చట్టంపై పూర్తిస్థాయి అవగాహన, సమాచారం అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఏ కార్యాలయంలో ఏ అధికారి వద్ద సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి? సంబంధిత ప్రజా సమాచార అధికారి ఎవరు? ఆయనను ఎలా సంప్రదించాలి? అనే కనీస వివరాలు కూడా బోర్డులపై లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన ఆర్టీఐ సూచిక బోర్డులు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సింది పోయి, అసంపూర్తి సమాచారంతో దిష్టిబొమ్మల్లా దర్శనమివ్వడం అధికారుల పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చట్టం లక్ష్యం దెబ్బతింటోందని మండిపడ్డారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఈ పరిస్థితి ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అమలు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చట్టం ద్వారా ప్రజలకు అందాల్సిన సమాచారం సక్రమంగా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని విమర్శించారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించాలి!ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రజలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా, సంపూర్ణంగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పాడైపోయిన, అసంపూర్తి సమాచారంతో ఉన్న పాత బోర్డులను తొలగించి, సంబంధిత ప్రజా సమాచార అధికారులు, వారి హోదాలు, పేర్లు, సంప్రదింపు ఫోన్ నంబర్లు, దరఖాస్తు విధానం తదితర వివరాలతో కూడిన నూతన ఆర్టీఐ సూచిక బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. చట్ట నిబంధనలను పాటించని అధికారులపై బాధ్యత నిర్ధారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

సమాచార హక్కు ప్రజల హక్కు.. అది కార్యాలయాల గోడలకే పరిమితం కాకుండా ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి రావాలి అని రాపోలు లింగస్వామి స్పష్టం చేశారు.