BREAKING
thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
Test 4
Date of Publish : 06 November 2026, 07:53 pm
Posted by : K MAHESH

మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక..

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:53 PM
5 వీక్షణలు

వాణిజ్య భవనాల ఇంటి పన్నుల్లో 40 శాతం తగ్గింపు

ప్రభుత్వం ఆమోదం.. వ్యాపారులు, భవన యజమానులకు ఊరట

మరిపెడ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 6: దీపావళి పండుగ సందర్భంగా మరిపెడ పట్టణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టణంలోని వాణిజ్య భవనాల ఇంటి పన్నుల్లో 40 శాతం తగ్గింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అధిక ఇంటి పన్నుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులు, వాణిజ్య భవనాల యజమానులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

మరిపెడ మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత పట్టణంలోని భవనాలకు విధించిన ఇంటి పన్నుల భారం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వాణిజ్య భవనాల యజమానులు అధిక పన్నులు చెల్లించాల్సి రావడంతో వ్యాపార వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. పన్నుల భారాన్ని తగ్గించాలని పట్టణ ప్రజలు, వ్యాపారులు పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వ స్థాయిలో పన్నుల తగ్గింపు కోసం కృషి చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన నూతన మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక తీర్మానం చేసింది. వాణిజ్య భవనాల ఇంటి పన్నులను తగ్గించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది.

ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ చొరవతో పాటు మున్సిపల్ పాలకవర్గం చేసిన ప్రయత్నాల ఫలితంగా వాణిజ్య భవనాల ఇంటి పన్నుల్లో 40 శాతం తగ్గింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అమలులోకి రావడంతో మరిపెడ పట్టణంలోని వాణిజ్య భవనాల యజమానులకు పన్నుల చెల్లింపులో గణనీయమైన ఊరట లభించనుంది.

దీపావళి పర్వదినం సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ ప్రజలకు తీపి కానుకగా మారిందని మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటి పన్నుల తగ్గింపునకు ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్‌కు మున్సిపల్ పాలకమండలి, పట్టణ ప్రజల తరఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.