BREAKING
thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ
Test 4
Date of Publish : 06 November 2026, 08:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీ.. కేంద్రం కొత్త ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 08:30 PM
7 వీక్షణలు

లబ్ధిదారుల గుర్తింపులో కీలక మార్పులకు మోదీ సర్కార్ యోచన.. కొత్త విధానంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పవా? లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో మార్పులు చేసి, బయోమెట్రిక్ ధృవీకరణతో పాటు ఓటర్ ఐడీని కూడా వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్ ఉండగా, ఓటర్ ఐడీ విషయంలో మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో పేర్లు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారనే చర్చ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్ ఐడీ ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తే ఓటరు జాబితాలో పేరు లేని వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీకి ప్రాధాన్యం కల్పిస్తే ఇప్పటివరకు ఆధార్ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయల పరిస్థితి ఏమిటనే చర్చ కూడా మొదలైంది. ఆధార్ వ్యవస్థ కోసం ఇప్పటివరకు రూ.13,633 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త విధానం నిజంగా అమల్లోకి వస్తుందా, వస్తే సామాన్య ప్రజలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాలి.