BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల హత్య..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Nov, 2026 - 03:51 PM
4 వీక్షణలు

బెంగళూరులో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన!

బెంగళూరు: కటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ క్యాబ్ డ్రైవర్ ఉదంతం బెంగళూరులో కలకలం రేపింది. శేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ తన భార్య పుట్టింటి వారితో మాట్లాడటంపై తరచూ గొడవలు జరుగుతున్నాయని భావించి తొలుత ఆమెను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

భార్య కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన నిందితుడు.. అనంతరం వారిని ఒక్కొక్కరిని తన ఇంటికి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అత్త రూపవతి, బావమరుదులు శివ, శంకర్, వారి భార్యలు, బావమరిది కుమారుడిని లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

వేర్వేరు రోజుల్లో ఇంటికి వచ్చిన వారిని రోకలిబండతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఒకే కుటుంబానికి చెందిన పలువురు వరుసగా అదృశ్యం కావడం, ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించడం ద్వారా పోలీసులు ఈ కేసు వివరాలను వెలికితీసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కుటుంబ విభేదాలు ఎంతటి విషాదానికి దారితీయవచ్చో ఈ ఘటన తెలియజేస్తోంది. కేసుకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.