BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:47 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గోడను ఢీకొని గాల్లోకి ఎగిరిన బైకర్..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Nov, 2026 - 03:47 PM
3 వీక్షణలు

స్వల్ప గాయాలతో బయటపడిన వైనం!

రాజస్థాన్: రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్ప్లెండర్ బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గోడను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు బైక్‌పై ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరి సుమారు 8 అడుగుల ఎత్తులో ఉన్న బోర్డును తాకుతూ రోడ్డుపై పడిపోయాడు.

ఈ ప్రమాదంలో బైకర్ హెల్మెట్ ధరించలేదని వీడియోలో కనిపిస్తోంది. అంత ఎత్తు నుంచి రోడ్డుపై పడినప్పటికీ అతడు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పైకి లేచి నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపించడంతో ఈ ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉండటంతో ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బైకర్ ప్రాణాలతో బయటపడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, 'యముడు సెలవులో ఉన్నాడేమో' అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటన ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తోంది. ప్రమాదం ఎంత చిన్నదైనా హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమని, వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.