BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ విద్యార్థిని కోయ శ్రీజ రెడ్డి..

తెలంగాణ
/ నల్గొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Nov, 2026 - 03:59 PM
8 వీక్షణలు

ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన

నల్లగొండ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థిని కోయ శ్రీజ రెడ్డి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం సుబ్బులాపురం గ్రామానికి చెందిన శ్రీజ అమెరికాలోని బోస్టన్‌లో ఎంఎస్ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.

ఈ నెల 2వ తేదీన వాకింగ్‌కు వెళ్లిన శ్రీజ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె కోసం ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అమెరికా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆమె అదృశ్యంపై విచారణ చేపట్టారు.

అమెరికా పోలీసుల సమాచారం ప్రకారం.. కార్సన్ బీచ్ హార్బర్ ప్రాంతంలో శ్రీజ ఫోన్ చివరిసారిగా లొకేషన్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె అక్కడి నుంచి ఎటువైపు వెళ్లింది? ప్రస్తుతం ఎక్కడ ఉంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వివిధ కోణాల్లో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు తమ కుమార్తె అదృశ్యమవడంతో తల్లిదండ్రులు యాదగిరి రెడ్డి, రూప తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెను క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

ఈ ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్ స్పందించి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. శ్రీజ ఆచూకీ గుర్తించి ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు సంబంధిత అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.