BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 04:02 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఢిల్లీ విమానాశ్రయంలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Nov, 2026 - 04:02 PM
4 వీక్షణలు

గినియా దేశస్థుడి అరెస్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ప్రయాణికుడి శరీరంలో దాచిన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ అక్రమ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ.5 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిర్దిష్ట సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అక్టోబర్ 28న కోనాక్రి నుంచి అడిస్ అబాబా మీదుగా ఢిల్లీకి చేరుకున్న గినియా దేశస్థుడిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 వద్ద తనిఖీ చేశారు.

ఈ క్రమంలో తన శరీరంలో మాదకద్రవ్యాలు దాచినట్లు సదరు ప్రయాణికుడు అధికారులకు వెల్లడించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అతడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైద్యుల సహాయంతో దశలవారీగా అతడి శరీరం నుంచి 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు.

వాటిలో మొత్తం 1,068 గ్రాముల అనుమానిత కొకైన్ లేదా ఎండీఎంఏ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఎన్‌డీపీఎస్ చట్టం నిబంధనల ప్రకారం సీజ్ చేశారు. ఈ కేసులో అక్టోబర్ 29న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్యుల అనుమతితో డిశ్చార్జ్ అయిన అనంతరం అతడిని తీహార్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.