BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:57 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి గ్లోబల్ సమ్మిట్..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Nov, 2026 - 03:57 PM
6 వీక్షణలు

ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌ను నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, వివిధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో చర్చించారు.

ఈ సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 8వ తేదీన 'తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్' నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లు, కరువు నివారణ చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇందుకోసం సుమారు 200 మంది వాతావరణ, పర్యావరణ రంగ నిపుణులను భాగస్వాములను చేయాలని ప్రతిపాదించారు.

గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఆరు ఎక్స్‌పో హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు రక్షా ఎక్స్‌పో, స్టార్టప్ పెవిలియన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వివిధ పారిశ్రామిక, వ్యాపార రంగాలకు సంబంధించి మొత్తం 52 రంగాలవారీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సమ్మిట్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రదర్శన కేంద్రాలు, సమావేశాల ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.