BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 06 November 2026, 08:28 pm
Posted by : K MAHESH

తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:28 PM
31 వీక్షణలు

పశువుల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించిన సర్పంచ్, పశువైద్యాధికారి

రామన్నపేట (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 6: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని తుమ్మలగూడెం గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రమ్, పశువైద్యాధికారి డాక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 45 దూడలకు మందులు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్దాసు విక్రమ్ మాట్లాడుతూ.. రైతులు తమ పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుల సూచనలు పాటించాలని కోరారు.

పశువైద్యాధికారి డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ.. నట్టల సమస్య వల్ల పశువుల ఆరోగ్యం, ఎదుగుదలతో పాటు పాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. ముఖ్యంగా దూడల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే నట్టల నివారణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. పశువైద్యుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో నట్టల నివారణ మందులు వేయించాలని రైతులకు సూచించారు.

పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడవచ్చని, పశుపోషకులు పశువుల ఆరోగ్య పరీక్షలు, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అటెండర్ రాజేందర్, ఉమ, సాగర్ రెడ్డి, గ్రామ ప్రజలు, రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.