BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 10:40 pm
Posted by : P GAJENDRA BABU

తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency Reporter
07 Nov, 2026 - 10:40 PM
4 వీక్షణలు

ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రావిళ్ల మునిరాజా నాయుడు, జి. పాలెం తేజవతి

శ్రీకాళహస్తి (ఎన్ టుడే న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు, రేణిగుంట మండలాల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. తొట్టంబేడు మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావిళ్ల మునిరాజా నాయుడు, రేణిగుంట మండలంలో బీజేపీ అభ్యర్థి జి. పాలెం తేజవతి గెలుపొందారు. ఈ విజయంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

విజయం సాధించిన అనంతరం రావిళ్ల మునిరాజా నాయుడు, జి. పాలెం తేజవతి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి తమ విజయానికి సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే నివాసంలో గెలుపొందిన అభ్యర్థులతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డిని నాయకులు, అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. నాయకులు, కార్యకర్తల నినాదాలతో నివాస ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

మరోవైపు తొట్టంబేడు, రేణిగుంట మండలాల్లోని పలు గ్రామాల్లో కూటమి కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభ్యర్థుల విజయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో సాధించిన విజయంతో మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.