BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 10:50 pm
Posted by : PARSIKA KAMESH

చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ పోలవరం
07 Nov, 2026 - 10:50 PM
1 వీక్షణలు

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి: జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్

చింతూరు (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: పోలవరం జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

నవంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలకు చెందిన కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతి దశలోనూ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించాలని సూచించారు.

చింతూరు మండలంలో ఎంపీటీసీ ఫలితాలు

చింతూరు మండలంలోని పలు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక స్థానంలో బీజేపీ, మరో స్థానంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:

  • పేగ పంచాయతీ: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తొడం రమాదేవి – 801 ఓట్లు.

  • ఏడుగురాళ్లపల్లి పంచాయతీ: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉయిక నాంచారమ్మ – 697 ఓట్లు.

  • తుమ్మల పంచాయతీ: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్యామల శోభణ – 758 ఓట్లు.

  • చిడుమూరు పంచాయతీ: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బంగారు కోటేశ్వరరావు – 440 ఓట్లు.

  • చట్టి పంచాయతీ: బీజేపీ అభ్యర్థి తుర్రం విర్రాజు – 459 ఓట్లు.

  • కల్లేరు పంచాయతీ: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లేల్లి బద్రయ్య – 1,061 ఓట్లు.

  • మోతుగూడెం పంచాయతీ: టీడీపీ అభ్యర్థి పొడిచారు విజయ – 642 ఓట్లు.

  • చింతూరు-1: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సొడి కళ్యాణి – 962 ఓట్లు.

  • చింతూరు-2: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిచ్చడి మురళి – 763 ఓట్లు.

జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం

చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలోని 12 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సవలం అమల 8,861 ఓట్లతో విజయం సాధించినట్లు వివరాల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం.