BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 10:43 pm
Posted by : VALLAPU KOTESH

బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
07 Nov, 2026 - 10:43 PM
15 వీక్షణలు

యజమాని నిర్లక్ష్యంపై మృతుడి భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

నాగార్జునసాగర్ (ఎన్ టుడే న్యూస్): బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు చిలుకమర్రి ముత్తయ్య (32) మృతి చెందాడు. ఈ ఘటన నవంబర్ 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకుంది.

పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ముత్తయ్య గత ఐదేళ్లుగా మాచర్లకు చెందిన ఓబుల్ రెడ్డి వద్ద బోర్‌వెల్ లారీ డ్రైవర్‌గా, డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీన రేకులారం గ్రామానికి చెందిన రైతు నరసింహ నాయక్ పొలంలో బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులు ప్రారంభించాడు.

పనులు జరుగుతున్న సమయంలో నిర్వహణ లోపం కారణంగా డ్రిల్లింగ్ యంత్రం అకస్మాత్తుగా ముత్తయ్య తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తోటి కార్మికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డ్రిల్లింగ్ యంత్రం నిర్వహణలో నిర్లక్ష్యానికి కారణమైన యజమాని ఓబుల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, తనకు, తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి భార్య చిలుకమర్రి యాదమ్మ (28) నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.