BREAKING
thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
Test 4
Date of Publish : 06 November 2026, 09:07 pm
Posted by : A. MURALIDHAR

జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
06 Nov, 2026 - 09:07 PM
4 వీక్షణలు

చౌడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 6

చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఎన్‌టీవీ జర్నలిస్టు అక్రమ్‌పై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు సంఘం నిరసన చేపట్టింది. జర్నలిస్టుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

నవంబర్ 5న వీకోట మండలంలో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా జర్నలిస్టు అక్రమ్ విధులు నిర్వహించారు. ఎన్నికల విధులు ముగించుకుని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సీఐ సోమశేఖర్ రెడ్డి ఆయన చొక్కా కాలర్ పట్టుకుని, దురుసుగా తోసివేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. విధులు నిర్వహించిన జర్నలిస్టుపై పోలీసు అధికారి ఈ విధంగా ప్రవర్తించడం పట్ల జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ ఘటనకు నిరసనగా అన్నమయ్య జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం (నవంబర్ 6) చౌడేపల్లి మండలానికి చెందిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టు అక్రమ్‌పై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్ రెడ్డిపై విచారణ జరిపి విధులు నుండి   తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.

ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ఎన్నికల సమయంలోనూ తమ విధులను నిర్వహిస్తారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల గౌరవం, భద్రతకు భంగం కలగకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. జర్నలిస్టులపై దురుసు ప్రవర్తనను సహించేది లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో చౌడేపల్లి మండలానికి చెందిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.