BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 09:34 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రేపు ఉదయం 8 గంటల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Nov, 2026 - 09:34 PM
12 వీక్షణలు

మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక కేంద్రాలు.. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి

అన్నమయ్య జిల్లా, పుంగనూరు (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 6

అన్నమయ్య జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందించేందుకు పాత్రికేయుల కోసం ప్రత్యేక మీడియా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జిల్లాలోని మదనపల్లిలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, రాయచోటి మాసాపేటలోని పాత ఎస్పీ కార్యాలయం, పీలేరులోని సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

మీడియా పాసులు ఉన్నవారికే అనుమతి

మీడియా పాసులు పొందిన పాత్రికేయులకు మాత్రమే మీడియా కేంద్రాల్లోకి ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 7 గంటలకు మీడియా ప్రతినిధుల కోసం టిఫిన్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి రౌండ్ పూర్తయిన అనంతరం ఫలితాలను మీడియా కేంద్రాల్లో వెల్లడించనున్నారు. దీంతో పాత్రికేయులు రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లు, ఫొటోలు, వీడియోలకు అనుమతి లేదు

మొబైల్ ఫోన్లను మీడియా కేంద్రం వరకు మాత్రమే అనుమతిస్తారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధమని అధికారులు తెలిపారు.

కెమెరాలతో వచ్చే మీడియా ప్రతినిధులను పోలీసు లేదా సమాచార శాఖ సిబ్బంది ఎస్కార్ట్‌తో కౌంటింగ్ హాల్ ప్రవేశ ద్వారం వరకు తీసుకెళ్తారు. అయితే బ్యాలెట్లపై ఉన్న ఓట్ల వివరాలు, ఫలితాలను ఫొటోలు తీయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

పార్కింగ్ నిబంధనలు పాటించాలి

మీడియా ప్రతినిధులు తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలపాలని అధికారులు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు పాత్రికేయులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.