BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 09:30 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బియ్యం బ్రాండ్ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Nov, 2026 - 09:30 PM
12 వీక్షణలు

ఒకే రకం బియ్యానికి వేర్వేరు ధరలు విధించరాదు.. నిర్ణయించిన ధరలకే విక్రయించాలి: జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

మదనపల్లి, అన్నమయ్య జిల్లా (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 6

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించి వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ స్పష్టం చేశారు. ఒకే రకం బియ్యాన్ని వేర్వేరు బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తూ అధిక ధరలు వసూలు చేయరాదని హెచ్చరించారు. బ్రాండ్ పేరుతో అదనపు ధరలు విధించేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం మదనపల్లి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు, ప్రైవేట్ రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం ధరల నియంత్రణ, ప్రభుత్వం నిర్ణయించిన విక్రయ ధరల అమలు, మార్కెట్ పరిస్థితులపై చర్చించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. బియ్యం ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందన్నారు. వినియోగదారుల ధరల సూచీ (CPI)లో బియ్యానికి గణనీయమైన ప్రాధాన్యత ఉన్నందున ధరల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు సాధారణ రకం బియ్యం ధర కిలోకు రూ.43.30 నుంచి రూ.60.60కు పెరిగిందని, సన్న బియ్యం ధర రూ.52.20 నుంచి రూ.72.70కు, సూపర్ ఫైన్ రకం బియ్యం ధర రూ.58.98 నుంచి రూ.80.89కు చేరిందని వివరించారు. ఈ పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ధరణి ఫైన్ రైస్ ద్వారా తక్కువ ధరకు బియ్యం

ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం ధరణి ఫైన్ రైస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద KNM రకం బియ్యాన్ని కిలో రూ.50కు, BPT రకం బియ్యాన్ని కిలో రూ.49కు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ విక్రయ కేంద్రాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో కూడా ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

వివిధ రకాల బియ్యానికి నిర్ణయించిన గరిష్ఠ ధరలు

పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో చర్చించిన అనంతరం వివిధ రకాల బియ్యానికి కిలోకు నిర్ణయించిన గరిష్ఠ రిటైల్ విక్రయ ధరలను జాయింట్ కలెక్టర్ వెల్లడించారు.

  1. BPT-3291 (సోనా): కిలో రూ.66

  2. BPT-5204 (సాంబా): కిలో రూ.66

  3. KNM: కిలో రూ.66

  4. HMT: కిలో రూ.76

  5. RNR: కిలో రూ.76

  6. జై శ్రీరామ్: కిలో రూ.82

  7. MTU సాధారణ రకాలు: కిలో రూ.47

వ్యాపారులు, రైస్ మిల్లర్లు ఈ ధరలను తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఒకే రకం బియ్యాన్ని వేర్వేరు బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తూ ధరల్లో వ్యత్యాసం చూపడం, బ్రాండ్ విలువ పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేయడం చేయరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఒక నెలపాటు విక్రయాలు కొనసాగించి ధరల నియంత్రణకు సహకరించాలని కోరారు.

వినియోగదారులు, రైతులు, వ్యాపారులు, రైస్ మిల్లర్ల ప్రయోజనాలను సమతుల్యంగా పరిగణనలోకి తీసుకుంటూ బియ్యం ధరలను స్థిరీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని శివ్ నారాయణ శర్మ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా పౌరసరఫరాల శాఖ అధికారులు మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు, ప్రైవేట్ రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.