BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 08:45 pm
Posted by : K MAHESH

బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:45 PM
7 వీక్షణలు

CLAT, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఖానాపూర్ (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 6

బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు CLAT (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)తో పాటు ఇతర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు అతిథి అధ్యాపకులను నియమించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పెరక సునీత తెలిపారు. ఈ నియామకానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రవేశ పరీక్షలకు అవసరమైన విషయాల్లో నాణ్యమైన బోధన అందించేందుకు అర్హులైన అధ్యాపకులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

అర్హతలు ఇవే..

ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎం., ఎం.ఏ. ఇంగ్లీష్, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ లేదా ఎకనామిక్స్‌లో విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు బోధన అనుభవం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని సూచించారు.

ప్రతి పీరియడ్‌కు రూ.650 గౌరవ వేతనం

ఎంపికైన అతిథి అధ్యాపకులకు ప్రతి పీరియడ్‌కు రూ.650 గౌరవ వేతనం చెల్లించనున్నారు. తరగతుల నిర్వహణ సమయం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని ప్రిన్సిపల్ వివరించారు.

దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 10

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 10, 2026లోగా బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలని ప్రిన్సిపల్ పెరక సునీత కోరారు. ఈ అవకాశాన్ని అర్హులైన అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.