BREAKING
thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ
Test 4
Date of Publish : 06 November 2026, 08:29 pm
Posted by : K MAHESH

దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:29 PM
12 వీక్షణలు

బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కేందుకే కేసులు నమోదు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 6

బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును బీఆర్ఎస్వీ నకిరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జెట్టి శివప్రసాద్ యాదవ్ ఖండించారు. ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను, రాజకీయ నాయకుల వ్యాఖ్యలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు ఆధారంగా బాలరాజు యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బల్మూరి వెంకట్ గతంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావులపై చేసిన వ్యాఖ్యలపై బాలరాజు యాదవ్ మీడియా సమావేశంలో స్పందించారని, ఈ నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులను ప్రశ్నించినందుకే కేసులు నమోదు చేస్తారా? మాట్లాడినందుకు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని శివప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. ఒకే అంశంలో వేర్వేరు వ్యక్తుల వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించడం ఏమిటని ప్రశ్నిస్తూ, చట్టం అందరికీ సమానంగా వర్తించాలని అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న ప్రజాస్వామ్య పాలన, ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. బాలరాజు యాదవ్ అరెస్టు విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఈ ఘటనపై సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.

బాలరాజు యాదవ్‌కు బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలవాలని శివప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజకీయ నాయకులపై కేసుల విషయంలో చట్టపరమైన విధానాలను పాటించాలని కోరారు.