BREAKING
thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ
Test 4
Date of Publish : 06 November 2026, 08:34 pm
Posted by : K MAHESH

బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:34 PM
16 వీక్షణలు

బీసీలు రాజకీయ అధికారమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపు

నారాయణపేట (ఎన్ టుడే న్యూస్):

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తీన్మార్ మల్లన్న చేసిన రాజకీయ వ్యాఖ్యలు తెలంగాణలో చర్చకు దారితీశాయి. బీసీలు రాజకీయ అధికారాన్ని లక్ష్యంగా చేసుకుని ఐక్యంగా ముందుకు సాగాలని, బీసీ నాయకులకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీసీల ఓట్లతోనే విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అవసరం లేదని, బీసీల ఓట్లతోనే తమ రాజకీయ విజయానికి నాంది పడుతుందని వ్యాఖ్యానించారు. బీసీలు ఆత్మగౌరవంతో ఏకమైతే తెలంగాణలో బీసీల రాజ్యం ఏర్పడుతుందని అన్నారు. బీసీలు ఇతర పార్టీలకు ఓట్లు వేయకుండా, బీసీ నాయకులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాజకీయాల్లో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతోందని, ఎదుగుతున్న బీసీ నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని మల్లన్న ఆరోపించారు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అవుతారని ఆయన వ్యాఖ్యానించారు.

నారాయణపేట జిల్లాలో సుమారు 80 శాతం మంది బీసీలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం 2.32 లక్షల ఓట్లు ఉండగా, అందులో బీసీల ఓట్లు 1.56 లక్షలు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 10,652 మాత్రమే ఉన్నాయని తన లెక్కలను వెల్లడించారు.

బీసీలు తమ ఓటు హక్కును రాజకీయ అధికార సాధనకు ఉపయోగించుకోవాలని, సామాజిక ఐక్యతతో రాజకీయంగా ఎదగాలని మల్లన్న తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.