BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 09:38 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నగరిలో విషాదం.. ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Nov, 2026 - 09:38 PM
9 వీక్షణలు

15 ఏళ్ల బాలిక మృతి.. మరో బాలికకు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స

నగరి (ఎన్ టుడే న్యూస్): చిత్తూరు జిల్లా నగరి మండలం కాకవేడు ఎస్టీ కాలనీలో బుధవారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు బాలికలు విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో మౌనిక (15) మృతి చెందగా, జీవిత (17) అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

చిన్నతనంలోనే తల్లులను కోల్పోయిన మౌనిక, జీవిత ఒకరికొకరు తోడుగా ఉంటూ సన్నిహితంగా మెలిగేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకేసారి విషపు గుళికలు మింగడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా, మౌనిక మృతి చెందినట్లు సమాచారం. జీవితకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇద్దరు బాలికలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు బాలికల సెల్‌ఫోన్ల డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.