BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 09:46 pm
Posted by : NUNE SRIKANTH

మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
06 Nov, 2026 - 09:46 PM
9 వీక్షణలు

రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన

అడుగుజాడలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. పులి ఉనికిపై ఇంకా స్పష్టత లేదు

నిజామాబాద్ జిల్లా (ఎన్ టుడే న్యూస్): వేల్పూర్ మండలం మోతే గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ వ్యవసాయ క్షేత్రంలో పులి కనిపించిందంటూ కొన్ని ఫొటోలు ప్రచారంలోకి రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంబంధిత ప్రాంతానికి చేరుకుని అక్కడ కనిపించిన అడుగుజాడలను పరిశీలించారు. అయితే అవి పులి అడుగుజాడలేనని ఇంకా నిర్ధారణ కాలేదని సమాచారం. అధికారులు మరింత పరిశీలన చేసిన తర్వాతే పులి సంచారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. పులి కనిపించినా, అనుమానాస్పద అడుగుజాడలు గుర్తించినా దాని దగ్గరకు వెళ్లకుండా అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలి.