BREAKING
thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ
Test 4
Date of Publish : 06 November 2026, 08:27 pm
Posted by : K MAHESH

జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:27 PM
6 వీక్షణలు

కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య

రామగుండం (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 6: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జంగాలపల్లిలో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక–రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య కొబ్బరికాయ కొట్టి ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత గృహాలు నిర్మించుకునే అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని నూతన గృహాల్లో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్తఫా, సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, వెంగళ బాపు, మాతూరి సత్యప్రసాద్, సీపీఐ మహిళా నాయకురాలు మహేశ్వరి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.