BREAKING
thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● హనుమకొండ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ
Test 4
Date of Publish : 06 November 2026, 08:33 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Nov, 2026 - 08:33 PM
11 వీక్షణలు

ఎస్సై సందీప్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్

కనిగిరి మున్సిపల్ ఎన్నికలపై సీపీఎం అభ్యర్థి పోలిచెర్ల కేశవరావు విమర్శలు

కనిగిరి (ఎన్ టుడే న్యూస్):

కనిగిరి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సీపీఎం కనిగిరి పట్టణ కార్యదర్శి, 29వ వార్డు అభ్యర్థి పోలిచెర్ల కేశవరావు ఆరోపించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు కూటమి నాయకులు తనతో పాటు పోలింగ్ ఏజెంట్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఆయన, ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సందీప్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేశవరావు మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రం వద్ద ఉండేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వకుండా ఎస్సై సందీప్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేయడంతో తాను ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు కూటమి నాయకులకు సహకరించారని ఆయన ఆరోపించారు. 29వ వార్డులో ఓటు హక్కు లేని కొందరు కూటమి నాయకులు సైతం అక్రమంగా ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేకుండా భయాందోళన వాతావరణం సృష్టించారని విమర్శించారు.

పోలింగ్ సమయంలో చోటుచేసుకున్నాయని చెబుతున్న అక్రమాలు, అధికారుల ఏకపక్ష వైఖరి కారణంగానే తాము ఓటమి చెందాల్సి వచ్చిందని కేశవరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సందర్భంగా జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సందీప్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కేశవరావు కోరారు. అలాగే ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి నాయకుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో సీపీఎం నాయకులు ఏడుకొండలు, నరేంద్ర, ప్రసంగి, నాగరాజు, చెన్నకేశవులు, కాసయ్య, వెంకటయ్య, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.