BREAKING
thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
Test 4
Date of Publish : 06 November 2026, 08:04 pm
Posted by : K MAHESH

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:04 PM
8 వీక్షణలు

మూఢనమ్మకాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ పవన్ కుమార్

మరిపెడలో చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

మరిపెడ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 6: విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, మూఢనమ్మకాలను విడనాడి హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ సూచించారు. జనవిజ్ఞాన వేదిక మరిపెడ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మరిపెడ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఐ పవన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, శాస్త్రీయ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. సమాజంలో కొనసాగుతున్న మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మకుండా, ప్రతి అంశాన్ని శాస్త్రీయ ఆధారాలతో పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, లక్ష్యాలను నిర్దేశించుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు.

ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు.

విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషితో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలు, సవాళ్లను విద్యార్థులతో పంచుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. మంచి విలువలు కలిగిన బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక మరిపెడ మండల శాఖ అధ్యక్షుడు, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు బయగాని రామ్మోహన్, ట్రెజరర్ నందిగామ జనార్ధనాచారి, చెకుముకి కన్వీనర్ లాలా చంద్, బాధ్యులు రాజకుమారి, ఉపాధ్యాయులు దేవులా, ప్రకాష్, శౌరి, రమేష్ రెడ్డి, లెనిన్, ప్రసాదరావు, సారయ్య, జహేదా బేగం, సురేష్, బాబురావు, అనిత, సుధ, మంజుశ్రీ, భువనేశ్వరి, శంకర్ తదితరులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.