BREAKING
thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
Test 4
Date of Publish : 06 November 2026, 07:44 pm
Posted by : K MAHESH

ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:44 PM
7 వీక్షణలు
  • పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్.. బయ్యారం పోలీసుల ప్రత్యేక చర్యలు

మహబూబాబాద్, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్): పోక్సో కేసులో న్యాయస్థానం విచారణకు వరుసగా హాజరుకాకుండా ఐదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని బయ్యారం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. న్యాయస్థానం జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేసే క్రమంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు బయ్యారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రవీందర్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఒజ్జోనిగూడెం గ్రామానికి చెందిన సూర్నపాక రాము (42)పై బయ్యారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2017లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది.

అనంతరం కేసు విచారణలో భాగంగా నిందితుడు న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉండగా, వరుసగా గైర్హాజరవుతూ విచారణకు దూరంగా ఉంటున్నాడు. దీంతో న్యాయస్థానం అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో వారెంట్ అమలుపై దృష్టి సారించిన బయ్యారం పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. చివరకు అతడిని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా సీఐ ఎల్. రవీందర్ మాట్లాడుతూ న్యాయస్థానాల ఆదేశాలను పాటించకుండా, విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు జారీ చేసిన వారెంట్ల అమలులో పోలీసులు నిరంతరం చర్యలు చేపడతారని తెలిపారు.

ఈ అరెస్టు కార్యక్రమంలో ఎస్ఐ ప్రశాంత్ బాబు, పోలీసు సిబ్బంది మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.