BREAKING
thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
Test 4
Date of Publish : 06 November 2026, 07:48 pm
Posted by : K MAHESH

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:48 PM
9 వీక్షణలు

ఆరుట్ల రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమం

ఇబ్రహీంపట్నం (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 6: మంచాల మండలం ఆరుట్ల గ్రామ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, నీటి సంరక్షణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాటర్ సంస్థ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మేనేజ్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేనేజ్ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పలు కీలక అంశాలపై వివరించారు.

ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, వాటికి అనుగుణంగా వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల ఎంపిక, సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడంలో భాగంగా చేపడుతున్న 'కృషి బచావో అభియాన్' గురించి వివరించారు. అలాగే వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై సూచనలు అందించారు.

పంట కోత అనంతరం మిగిలే అవశేషాలను సక్రమంగా నిర్వహించడం, వాటిని కాల్చకుండా నివారించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. భూసారాన్ని కాపాడుకుంటూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆరుట్ల గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకంరాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలు, సూచనలను రైతులు పాటించాలని కోరారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగిస్తూ పంటలను కాపాడుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మేనేజ్ సంస్థ ప్రతినిధులు బాలసుబ్రమణ్యం, సలింద్ర సాయికిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారి నికిత, వాటర్ సంస్థ ప్రతినిధులు మూలకృష్ణ, మేఘన, భరత్‌రాజు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కొండిగారి శ్రావణ్‌కుమార్, పున్నం రాము, రావుల జంగయ్య, మానిపాటి భానుప్రసాద్, మొర్రి పద్మ, ఐలయ్య, లాలాగరి మణెమ్మతో పాటు పీసీ తండా, చిత్తాపూర్, ఉండాలేమూరు, బుగ్గ తండా, ఆరుట్ల గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.