BREAKING
thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
Test 4
Date of Publish : 06 November 2026, 07:41 pm
Posted by : P GAJENDRA BABU

MPTC, ZPTC ఓట్ల లెక్కింపునకు పటిష్ట పోలీస్ బందోబస్తు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency Reporter
06 Nov, 2026 - 07:41 PM
9 వీక్షణలు

స్కిట్ కాలేజీలో 150 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు.. ఏజెంట్ ఫారం ఉన్నవారికే అనుమతి

తొట్టంబేడు, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్): స్కిట్ కాలేజీలో శనివారం నిర్వహించనున్న తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 150 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు విధులు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

కౌంటింగ్ కేంద్రం పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ఎవరూ గుంపులు గుంపులుగా తిరగకూడదని, కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో అనవసరంగా గుమిగూడరాదని స్పష్టం చేశారు.

కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సంబంధిత ఏజెంట్ ఫారం కలిగి ఉన్నవారిని మాత్రమే కేంద్రం లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు. అనుమతి లేని వ్యక్తులకు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం ఉండదని పేర్కొన్నారు. అదేవిధంగా సెల్‌ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని, కాబట్టి ఫోన్లను బయటే ఉంచి రావాలని సూచించారు.

ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని అధికారులు కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.