BREAKING
thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
Test 4
Date of Publish : 06 November 2026, 07:56 pm
Posted by : K MAHESH

జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:56 PM
11 వీక్షణలు

బయ్యారం మండల కేంద్రంలో మూడు ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సీపీఎం డిమాండ్

బయ్యారం (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 6: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి మూడు చోట్ల ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. సంత రోడ్డు, బస్టాండ్ సెంటర్, రామాలయం వద్ద ఎగ్జిట్లు నిర్మించాలని కోరుతూ శుక్రవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా కుంట ఉపేందర్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మండా రాజన్న, మండల కార్యదర్శి నంబూరి మధు మాట్లాడుతూ.. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో స్థానిక ప్రజల రాకపోకలు, అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. బయ్యారం మండల కేంద్రంలో మూడు చోట్ల ఎగ్జిట్లు ఏర్పాటు చేయకపోతే ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సమీప గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్య సేవలను పొందేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్థానిక అవసరాలను విస్మరించి రహదారి నిర్మాణ పనులు చేపడితే ప్రజలకు ఇబ్బందులు తప్పవని తెలిపారు. అందువల్ల సంత రోడ్డు, బస్టాండ్ సెంటర్, రామాలయం వద్ద ఎగ్జిట్ల ఏర్పాటుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడు ఎగ్జిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించకపోతే ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ రాస్తారోకోలో సీపీఎం మండల నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు, నిడికొండ చంటి, మంకెన తిరుపతిరావు, యాకూబ్, రాము, కన్నయ్య, బుజ్జిబాబు, మారయ్య, రాంరెడ్డి, వార్డు సభ్యులు కత్తి రమేష్, గుగులోత్ రూపేష్ తదితరులు పాల్గొన్నారు.