BREAKING
thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
Test 4
Date of Publish : 06 November 2026, 08:10 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైఎస్సార్సీపీ నేత పోతు రమణారెడ్డికి పరామర్శ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Nov, 2026 - 08:10 PM
13 వీక్షణలు

గోపీనాథ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

కనిగిరి (ఎన్ టుడే న్యూస్): కనిగిరి మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి పోతు రమణారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన కాలు విరగడంతో గోపీనాథ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి పోతు రమణారెడ్డిని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం చికిత్స అందిస్తున్న వైద్యుడిని కలిసి రమణారెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యం, చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మడతల కస్తూరి రెడ్డి, గోపవరపు బొర్రారెడ్డి, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, ఓకే రెడ్డి, శెట్టిపల్లి కొండయ్య, పెరికల వెంకటేశ్వర్లు, తిండి రాజారెడ్డి తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.