BREAKING
thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
Test 4
Date of Publish : 06 November 2026, 07:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరులో ఏసీబీ వలలో పర్యావరణ ఇంజినీర్..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 07:54 PM
14 వీక్షణలు

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

ఏలూరు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ పర్యావరణ ఇంజినీర్ సీతారామచంద్రమూర్తి ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. తిమ్మాపురంలో గిడ్డంగి ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయాలంటే లక్ష రూపాయలు లంచంగా ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు రూ.30 వేల వద్ద బేరం కుదరడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఏలూరులోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందాల్సిన సేవల కోసం లంచాలు డిమాండ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ విధులను నిర్వర్తించాల్సిన అధికారులే లంచాలకు పాల్పడితే సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపడుతున్నారు.