BREAKING
thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
Test 4
Date of Publish : 06 November 2026, 07:47 pm
Posted by : PEDDABOINA SRIKANTH

బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట పట్టణ
06 Nov, 2026 - 07:47 PM
11 వీక్షణలు
  • ఎనిమిది మందికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్

ఎల్కతుర్తి, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్): ఎల్కతుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మండలంలోని దామెర గ్రామానికి చెందిన పలువురు నాయకులు శుక్రవారం బీజేపీలో చేరారు. సిద్ధిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీలో చేరిన దామెర గ్రామ నాయకులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కొమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన వారిలో ఒద్దుల రవి, ఒద్దుల సంపత్, పిప్పల విజేందర్, పండ్రాల రమేష్, కోప్పర ప్రభాకర్, కోప్పర సంబరాజు, సాతురి వరుణ్, ఠాకూర్ రోహిత్ సింగ్ ఉన్నారు. వీరంతా పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల ఆసక్తితో బీజేపీలో చేరినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మండలంలోని వివిధ గ్రామాల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో దామెర శక్తి కేంద్ర ఇన్‌చార్జి శామ్ సింగ్, సాతురి ప్రభాకర్, చల్ల రవీందర్ రెడ్డి, పండ్రాల సదానందం, పండ్రాల రాజయ్య, నామిండ్ల ప్రవీణ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.